News

తమళనాడు ఆర్‌కెనగర్ ఉప ఎన్నిక రద్దు


తమిళనాడులోని ఆర్.కె.నగర్ ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ నెల పన్నెండున ఈ ఉప ఎన్నిక జరగవలసి ఉంది. ఈ ఎన్నికలలో అన్నా డి.ఎమ్.కె. మంత్రి విజయభాస్కర్ ఆద్వర్యంలో ఎనభై కోట్ల రూపాయలు మేర పంచడం జరిగిందన్న ఆరోపణలు రావడం, ఐటి శాఖ దాడులు జరిపి నివేదిక ఇచ్చిన నేపద్యంలో రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. శశికళ వర్గం తో పాటు,పన్నీర్ సెల్వం వర్గం , అలాగే డి.ఎమ్.కె కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖర్చుపెడుతున్నాయి. గతంలో కూడా ఎన్నికల సంఘం ఈ రాష్ట్రంలో తంజావూరు, అరవకుర్చీ నియోజకవర్గాలలో కూడా ఎన్నికలను ఈ కారణంతోనే రద్దు చేశారు